బెంగళూరు రేవ్ పార్టీ.. ఫామ్హౌజ్ ఓనర్కు నోటీసులు

బెంగళూరు రేవ్ పార్టీ..  ఫామ్హౌజ్ ఓనర్కు నోటీసులు

బెంగళూరు రేవ్ పార్టీపై దర్యాప్తు  స్పీడప్ చేశారు పోలీసులు.  జీఆర్ ఫామ్ హౌజ్ ఓనర్ గోపాల్ రెడ్డికి సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మే 27న  విచారణ అధికారి ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు.  

బెంగళూరు రేవు పార్టీ కేసులో వైసీపీ ఎమ్మెల్యే వాహనంపై స్పెషల్ ఫోకస్ చేశారు CCB పోలీసులు. పూర్ణారెడ్డి అనే వ్యక్తి మంత్రి వాహనాన్ని ఉపయోగించినట్లు గుర్తించారు. పోలీసుల రైడ్స్ టైంలో ఫామ్ హౌస్ నుంచి పూర్ణారెడ్డి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు.

రేవ్ పార్టీ కేసులో చిత్తూరు మూలాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు.  చిత్తూరు జిల్లాకు చెందిన రణధీర్, అరుణ్ కుమార్ కీలకంగా వ్యవహరించడంతో వివరాలు సేకరిస్తున్నారు.  A2అరుణ్ కుమార్,  A4 రణధీర్ బాబు పేర్లను ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన పోలీసులు.. రణధీర్ బాబు డెంటిస్ట్ గా చేస్తున్నట్లు గుర్తించారు.   అరుణ్ కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా గుర్తించారు. రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న వారిలో చిత్తూరు జిల్లా వాసులే ఎక్కువగా ఉన్నారని చెబుతున్నారు పోలీసులు.

ఇప్పటికే  బెంగళూరు రేవ్ పార్టీకి వచ్చిన వారిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు. వారిలో టాలీవుడ్ నుంచి హేమ్, ఆషీరాయ్ ఉన్నారు.