యాక్టివాను ఢీకొట్టిన లారీ.. లేడీ ఏఎస్సై మృతి

యాక్టివాను ఢీకొట్టిన లారీ.. లేడీ ఏఎస్సై మృతి

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కమాన్‌పూర్ చౌరస్తా దగ్గర స్కూటీని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కమాన్ పూర్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్న భాగ్యలక్ష్మి అక్కడికక్కడే చనిపోయింది. భాగ్యలక్ష్మి తన కూతరుతో కలిసి యాక్టివాపై వెళ్తుండగా.. వెనక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. కూతురు బండి నడుపుతుండగా..  భాగ్యలక్ష్మి వెనక సీట్లో కూర్చుంది. వీరు కిందపడగానే.. భాగ్యలక్ష్మి పైనుంచి లారీ వెళ్లడంతో డెడ్ బాడీ నుజ్జునుజ్జు అయింది.  ప్రమాదంలో ఆమె కూతురుకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కాగా.. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. 

ఘటనాస్థలానికి చేరుకున్న పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, ఎస్సై రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ గుజరాత్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన భాగ్యలక్ష్మి.. గతంలో పెద్దపల్లి, జూలపల్లి, బసంత్ నగర్, సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లలో పనిచేసింది.