మెట్టుగూడలో పోలీసుల ఓవర్ యాక్షన్

మెట్టుగూడలో పోలీసుల ఓవర్ యాక్షన్

న్యాయం చేయాల్సిన పోలీసులు విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. కొంతమంది పోలీసులు మాత్రం నిజాయితీగా పని చేస్తుంటే.. మరికొంతమంది ఆ శాఖకే మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. సికింద్రాబాద్ లోని మెట్టుగూడలో పోలీసులు ఓ వ్యక్తిని ఇష్టానుసారంగా కొట్టారు. ఈ ఘటనపై పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందరి ముందే.. కర్రతో బాదడం, కాళ్ల మధ్య పెట్టి.. లాగి దారుణంగా ప్రవర్తించారు. బూట్లతో తన్నుతూ.. చేతులను తొక్కడం చేశారు. దీంతో ఆ వ్యక్తికి గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సికింద్రాబాద్ మెట్టుగూడలో  దారుణం జరిగింది. బైక్ విషయమై ఇద్దరి మధ్య  గొడవ జరగడంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు మెట్టుగూడలో  ఉండే జిమ్ ట్రైనర్ సూర్య ఆరోక్య రాజ్ ను విచారణకు రమ్మని  నిన్న రాత్రి ఇంటికి వెళ్లి  పిలిచారు.

ఉదయాన్నే వస్తానని ఆరోక్య రాజ్ చెప్పడంతో  చిలకలగూడ కానిస్టేబుళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట బూట్లతో  తన్నారు. ట్రైనర్  ఎదురుతిరగడంతో వివాదం పెరిగింది. దీంతో సూర్య ను ఓ కర్రతో చితకబాదారు. గాయపడ్డ జిమ్ ట్రైనర్ కు హాస్పిటల్ కు తరలించారు. మెట్టుగుడ లో పోలీసుల ఘటనలో గాయపడిన సూర్యకు గాంధీ హాస్పిటల్ డాక్టర్లు సర్జరీ చేశారు. గాయం గట్టిగా తగలడంతో కాలు కొద్దిగా పగులు ఏర్పడిందని, సూర్య ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. పోలీసులు తనను తీవ్రంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుడు సూర్య. కాలు విరిగేలా దుడ్డు కర్రతో కొట్టారన్నాడు. పోలీస్ స్టేషన్ కు రమ్మంటే వస్తానని చెప్పినా వినకుండా కొట్టారని వాపోయాడు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఉన్నతాధికారులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

మరిన్ని వార్తల కోసం : -
ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఫీజులు దోపిడి


ఉద్యోగాల పేరుతో టోకరా.. వ్యక్తి అరెస్టు