
ఉత్తర్ ప్రదేశ్ పోలీస్ శాఖ వద్ద ఉన్న తుపాకులు , టియర్ గ్యాస్ షెల్స్ సరిగా పని చేయడం లేదు. బల్లియాలో నిర్వహించిన శిక్షణా శిబిరంలో పోలీసులు ప్రయోగించిన టియర్ గ్యాస్ పేలకుండానే తుస్సుమన్నాయి. మాడు, నాలుగు సార్లు ప్రయత్నించినా టియర్ గ్యాస్ ను ప్రయోగించలేకపోయారు ట్రైనీ పోలీసులు. షెల్స్ పాడై పోయినందునే పేల్చలేకపోయామని అధికారులు చెబుతున్నారు. అల్లరి మూకలను అదుపు చేసేందుకు ప్రయోగించే టియర్ గ్యాస్ పనిచేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. యూపీ పోలీసు శాఖ నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.