ఒక్కొక్కరిగా బయటికొస్తున్న ఎమ్మార్వో లావణ్య బాధితులు

ఒక్కొక్కరిగా బయటికొస్తున్న ఎమ్మార్వో లావణ్య బాధితులు

బుధవారం నాలుగు లక్షలు తీసుకుంటూ పట్టుపడ్డ విఆర్వో అంతయ్య కేసులో  కేశవపేట్  తహశీల్థార్ లావణ్యను  ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతయ్య వెనుక లావణ్య పాత్ర ఉందని ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించారు . ఆమె ఇంటిలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు 93 లక్షల 50 వేల రూపాయలతో నగదు తో పాటు, 400 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు.

ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిన ఉన్నట్లు తెలడంతో లావణ్య ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు ఉదయం నుండి సాయంత్రం వరకు నాంపల్లి లోని ఏసీబీ కార్యాలయంలో విచారించారు. విచారణ అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి , మరల ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఫార్మల్టీస్ పూర్తి చేసిన అనంతరం ఎమ్మార్వో లావణ్య , విఆర్వో అంతయ్య లను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

ప్రస్తుతం లావణ్య భర్త వెంకటేశ్ నాయక్ పరారీలో ఉన్నారు. గతంలోనూ లావణ్యపైనా అనేక ఆరోపణలు వచ్చాయి. ఆమె బాధితులు ఒక్కొక్కరుగా బయటికొస్తున్నారు. గతంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఓ రైతు తన సమస్య పరిష్కరించాలంటూ ఎమ్మార్వో లావణ్య కాళ్లపై పడి వేడుకున్నాడు. తన సొంత భూమిని వేరేవాళ్లకు పట్టా చేశారని మరో బాధితురాలు కన్నీళ్లు పెట్టుకుంది.