అమీన్ పూర్ లో సీక్రెట్ గా వ్యభిచారం

V6 Velugu Posted on Nov 25, 2021

హైదరాబాద్ : సీక్రెట్ గా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు గురువారం వ్యభిచార గృహాలపై దాడిచేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం అమీన్‌ పూర్‌ పరిధి నరేంద్రకాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌ లో మహిళ ఇంట్లో గుట్టుచప్పుడుగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. ఈ మేరకు దాడిచేసి, విటులు జగదీశ్‌ సింగ్, మోహన్‌ను, ఇద్దరు యువతులతో పాటు నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పటేల్‌ గూడ భెల్‌ మెట్రో కాలనీలో మరో ఇంటిపై దాడిచేసి, విటుడు అరవింద్‌ను, ఓ యువతిని అదుపులోకి తీసుకుని, విటులు ముగ్గురిని రిమాండ్‌ తరలించినట్లు చెప్పారు సీఐ శ్రీనివాసులు. 


 

Tagged Hyderabad, POLICE, Arrested, raid, , brothel houses

Latest Videos

Subscribe Now

More News