హత్య కేసులో ఇండియన్‌ స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్

హత్య కేసులో ఇండియన్‌ స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్

ఢిల్లీలో దారుణం దారుణ హత్య జరిగింది. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువ రెజ్లర్‌ మరణించారు. అయితే బాధితుడి మృతిలో ఇండియన్‌ స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మోడల్ టౌన్ ప్రాంతానికి చెందిన ఛత్రసాల్ స్టేడియం సమీపంలో ఇండియన్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌కు చెందిన ఇంట్లో సాగర్ కుమార్, అమిత్‌ కుమార్‌, ప్రిన్స్‌ దలాల్‌ ఉంటున్నారు. ఇల్లు ఖాళీ చేసే విషయమై,  ఇరువర్గాల మధ్య సుమారు 4 గంటల పాటు ఘర్షణ జరిగినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. 


ఈ క్రమంలో..తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఛత్రసాల్ స్టేడియం సమీపంలో ఇద్దరు వ్యక్తులు తుపాకీతో ఇతరులపై కాల్పులు జరిపినట్లు  పోలీస్‌ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందింది. దీంతో ఘటనస్థలానికి చేరుకున్న మోడల్‌ స్టేషన్‌ పోలీసులు ఘటనా స్థలంలో 23 ఏళ్ల సాగర్‌ కుమార్‌ చనిపోయి పడి ఉన్నాడు. అతడిని ఢిల్లీ పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ కుమారుడిగా గుర్తించారు. ఇక ఈ ఘటనలో సోను మహల్ (35), అమిత్ కుమార్ (27) గాయపడ్డారు. ఈ క్రమంలో ప్రిన్స్‌ దలాల్ (24) అనే యువకుడిని అరెస్ట్‌ చేసి.. పార్క్‌ చేసిన ఓ వాహనంలో బుల్లెట్లు లోడ్‌ చేసిన గన్‌ ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 


ఈ హత్యలో సుశీల్‌ కుమార్‌ హస్తం ఉందని తేలడంతో అతనిపై ఎఫైఆర్‌ నమోదు చేసి లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గురిక్బాల్ సింగ్ సిద్ధూ చెప్పారు. కేసు దర్యాప్తు భాగంగా సుశీల్‌ కుమార్‌ కోసం వాళ్ల ఇంట్లో సోదాలు చేశామన్నారు. అక్కడ సుశీల్‌ కుమార్‌ లేడని..  పోలీసులు బృందాలుగా విడిపోయి సుశీల్‌ కుమార్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.