గర్భిణులకు ఈవెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  దిగొచ్చిన బోర్డు

గర్భిణులకు ఈవెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  దిగొచ్చిన బోర్డు

కొత్తగా 7 మార్కులతో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ‘మినహాయింపు’ అవకాశం
నోటిఫికేషన్ రిలీజ్ చేసిన పోలీస్ రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బోర్డు చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీవీ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు
ఈ నెల 28 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగింపు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : గర్భిణులకు, బాలింతలకు ఈవెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పోలీస్ రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బోర్డు దిగొచ్చింది. ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో 7 మార్కులు కలిపిన తర్వాత క్వాలిఫై అయిన గర్భిణులు, బాలింతలు.. ఫిజికల్ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంటే ముందే మెయిన్స్ రాసేందుకు అవకాశం కల్పించింది. అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టేకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2 అప్లికేషన్ల గడువును ఈ నెల 28 వరకు పొడిగించింది. ఇందుకు సంబంధించి టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వి.వి.శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. తమను ఫిజికల్ టెస్టుల నుంచి మినహాయించాలని కోరుతూ గర్భిణులు నిరుడు డిసెంబర్ లో హైకోర్టును ఆశ్రయించగా.. ఫిజికల్ టెస్ట్ లేకుండానే గర్భిణులు మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యేలా చూడాలని కోర్టు ఆదేశాలిచ్చింది. ఆ మేరకు గర్భిణులను ఫిజికల్ టెస్టుల నుంచి తాత్కాలికంగా మినహాయిస్తూ తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బోర్డు డిసెంబర్ 27న ఉత్తర్వులు జారీ చేసింది.

నహాయింపు కోసం అప్లై చేసుకునేందుకు జనవరి 20 నుంచి 31 వరకు గడువు విధించింది. దీంతో వందలాది మంది గర్భిణులకు ఊరట లభించింది. ఈ క్రమంలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రభుత్వం జనవరి 30న ఏడు మార్కులు కలపడంతో ఈవెంట్స్ కు మరికొందరు అర్హత సాధించారు. వీరిలో గర్భిణులు ఉన్నారు. మినహాయింపు కోసం గర్భిణులు అప్లై చేసుకునే గడువు జనవరి 31తోనే ముగిసింది. దీంతో తమకూ అవకాశం కల్పించాలని గర్భిణులు ఆందోళనలు చేయడంతో ఈవెంట్స్ నుంచి తాత్కాలికంగా మినహాయిస్తూ పీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఫైనల్ ఫలితాలు వెల్లడైన నెల రోజుల్లోపు ఫిజికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్ (పీఎమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ), ఫిజికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎఫిషియెన్సీ టెస్ట్(పీఈటీ)కి హాజరు కావాల్సి ఉంటుంది. ఇందుకోసం అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టేకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వాల్సి ఉంటుంది.