కాంగ్రెస్ పార్టీతోనే కార్పొరేషన్ అభివృద్ధి : ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి

కాంగ్రెస్ పార్టీతోనే కార్పొరేషన్ అభివృద్ధి : ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి
  • ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కాంగ్రెస్​ పార్టీతోనే కొత్తగూడెం కార్పొరేషన్​ అభివృద్ధి చెందుతోందుని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. కొత్తగూడెంలోని 55వ డివిజన్​లో మంగళవారం ఏర్పాటైన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళంలో ఆయన మాట్లాడారు. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతో పాటు సుజాతనగర్​ మండలంలోని ఏడు పంచాయతీలను కలిపి కొత్తగా కొత్తగూడెం కార్పొరేషన్​ను ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్​ ప్రభుత్వందేనన్నారు.

దేశంలోనే తొలి ఎర్త్​ సైన్సెస్​ యూనివర్సిటీని పాల్వంచలోనే ఏర్పాటు చేశామని తెలిపారు. త్వరలో జరగబోయే కార్పొరేషన్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ప్రతి నేత, కార్యకర్తపై ఉందన్నారు. ఈ ప్రోగ్రాంలో కాంగ్రెస్​ నేతలు నాగ సీతారాములు, వై. శ్రీనివాస్​ రెడ్డి, ఆళ్ల మురళి, కోనేరు సత్యనారాయణ, టి. దేవీ ప్రసన్న, అర్జున్​ రావు, మేరెడ్డి జనార్దన్ రెడ్డి, నాగేంద్ర త్రివేధి పాల్గొన్నారు.