- నలుగురిపై రూ.20 లక్షల రివార్డ్
జమ్మూ: జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలో ఆర్మీ పెట్రోలింగ్ వాహనంపై దాడి చేసి ఐదుగురు జవాన్ల మరణానికి కారణమైన టెర్రరిస్టుల ఊహాచిత్రాల (స్కెచ్) ను పోలీసులు విడుదల చేశారు. అలాగే ఒక్కో టెర్రరిస్ట్ తలపై రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.20 లక్షల రివార్డ్ ప్రకటించారు. టెర్రరిస్టుల గురించి విశ్వసనీయమైన సమాచారం ఇచ్చిన వారికి రివార్డ్ మొత్తం ఇస్తామని ప్రకటించారు.
శనివారం ఈ వివరాలను పోలీసులు ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. కథువా జిల్లా మల్హర్, బని, సియోజ్‌ధర్ ప్రాంతాల్లోని ఎత్తైన కొండలు, అటవీ ప్రాంతాల్లోని మట్టి-ఇండ్ల (ధోక్స్)లో ఈ నలుగురు కొన్ని రోజులు తలదాచుకున్నట్టు తెలిపారు. వీరిని పాకిస్తాన్ ప్రేరేపిత జైష్ ఏ మహమ్మద్ సంస్థ అనుబంధమైన ‘కాశ్మీర్ టైగర్స్’కు చెందిన టెర్రరిస్టులుగా గుర్తించారు.
