ఇయ్యాల హైదరాబాద్‌‌లో సదర్ ట్రాఫిక్ ఆంక్షలు

ఇయ్యాల హైదరాబాద్‌‌లో సదర్ ట్రాఫిక్ ఆంక్షలు
  • నారాయణ గూడలో రాత్రి 7  నుంచి తెల్లవారుజామున 3 గంటల దాకా
  • వైఎంసీఏ జంక్షన్‌‌ మీదుగా నో ఎంట్రీ, ట్రాఫిక్ డైవర్షన్‌‌

హైదరాబాద్‌‌,వెలుగు : సదర్‌‌‌‌ ఉత్సవ మేళా సందర్భంగా నారాయణగూడలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మంగళవారం రాత్రి 7 గంటల నుంచి బుధవారం తెల్లవారుజామున 3 గంటల వరకు ట్రాఫిక్  డైవర్షన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌‌ను సిటీ ట్రాఫిక్ చీఫ్‌‌ సుధీర్‌‌‌‌బాబు సోమవారం విడుదల చేశారు. నారాయణగూడ వైఎంసీఏ రూట్‌‌లో ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో  వెళ్లాలని సూచించారు.

ట్రాఫిక్‌‌ డైవర్షన్స్‌‌  ప్రాంతాలు

  • కాచిగూడ క్రాస్ రోడ్స్‌‌ నుంచి వైఎంసీఏ రూట్‌‌లో వచ్చే వాహనాలను టూరిస్ట్‌‌ హోటల్‌‌ రోడ్‌‌లో దారి మళ్లిస్తారు.
  • విఠల్‌‌వాడి క్రాస్‌‌ రోడ్స్ నుంచి వచ్చే ట్రాఫిక్‌‌ను భవన్స్‌‌ న్యూ సైన్స్‌‌ కాలేజ్‌‌, కింగ్‌‌కోటి మీదుగా డైవర్ట్ చేస్తారు.
  • స్ట్రీట్ నంబర్‌‌‌‌ 8 నుంచి వైఎంసీఏ వైపు నో ఎంట్రీ, రెడ్డి కాలేజ్‌‌ వద్ద బర్కత్‌‌పురా వైపు పంపిస్తారు. 
  • ఓల్డ్‌‌ బర్కత్‌‌పురా పోస్ట్‌‌ ఆఫీస్‌‌ నుంచి వైఎంసీఏ వైపు నో ఎంట్రీ, ట్రాఫిక్‌‌ను క్రౌన్ కేఫ్‌‌, బాగ్‌‌ లింగంపల్లి వైపు మళ్లిస్తారు.
  • ఓల్డ్‌‌ ఎక్సైజ్ ఆఫీస్‌‌ నుంచి వచ్చే వాహనాలను విఠల్‌‌వాడి మీదుగా డైవర్ట్ చేస్తారు.
  • బర్కత్‌‌పురా చమాన్ నుంచి వైఎంసీఏ వైపు అనుమతి లేదు. బర్కత్‌‌పురా క్రాస్ రోడ్స్, టూరిస్ట్ హోటల్‌‌ నుంచి డైవర్ట్ చేస్తారు. 
  • బ్రిలియంట్ గ్రామర్ స్కూల్‌‌ నుంచి రెడ్డి కాలేజి వైపు నో ఎంట్రీ, నారాయణగూడ క్రాస్ రోడ్స్‌‌ మీదుగా పంపిస్తారు. 
  • సికింద్రాబాద్‌‌ నుంచి కోఠి వైపు వచ్చే ఆర్టీసీ బస్సులను నారాయణగూడ క్రాస్‌‌ రోడ్స్, బర్కత్‌‌పురా, బాగ్‌‌లింగంపల్లి, వీఎస్‌‌టీ, ఆర్టీసీ రోడ్స్‌‌ మీదుగా మళ్లిస్తారు.
  • సదర్‌‌‌‌ మేళాకు వచ్చే వాహనాలను శాంతి థియేటర్‌‌‌‌, రెడ్డి కాలేజ్‌‌, మెల్కొటే పార్క్‌‌, దీపక్ థియేటర్‌‌‌‌ పార్కింగ్‌‌ ఏరియాల్లో పార్క్‌‌ చేయాలి.