NEW YEAR 2024 :న్యూ ఇయర్ ఈవెంట్స్పై పోలీసుల ఆంక్షలు

NEW YEAR 2024 :న్యూ ఇయర్ ఈవెంట్స్పై పోలీసుల ఆంక్షలు

హైదరాబాద్ లో  న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. పర్మిషన్ తీసుకున్న ఈవెంట్స్ కు మాత్రమే అనుమతిస్తామని చెప్పారు పోలీసులు. డిసెంబర్ 22 వరకు పర్మిషన్ గడువు పూర్తయిందని చెప్పారు. ప్రతీ ఈవెంట్ దగ్గర ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు పోలీసులు.  ప్రైవేట్ ఈవెంట్స్ ఎక్సైజ్ పర్మిషన్ తప్పకుండా తీసుకోవాలన్నారు.  అన్ లిమిటెడ్ ఫుడ్, లిక్కర్ అని పెడితే.. ఈవెంట్ కి వచ్చేవారికి సరిపోయే ఫుడ్ లిక్కర్ ఉండాలన్నారు.  ఈవెంట్స్ లో అశ్లీల డ్యాన్స్ లు ఉండకూడదని హెచ్చరించారు

సిటీ అంతా డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుందన్నారు పోలీసులు.  ఈవెంట్, బార్స్, పబ్స్ నిర్వాహకులు డ్రైవర్స్ ని అరేంజ్ చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. డ్రగ్స్ దొరికితే  పబ్, ఈవెంట్ ఆర్గనైజర్లపై కూడా కేసులు పెడుతామన్నారు. రోడ్లపై న్యూసెన్స్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.  సిటీ ఔట్ స్కట్స్ లో ఉండే ఫామ్ హౌజ్ లపై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు. 

పోలీసుల సూచనలు, హెచ్చరికలు ఇవే

  •  ప్రతి ఈవెంట్‌లో సెక్యూరిటీ తప్పనిసరి.
  •  సామర్థ్యానికి మించి పాసులు ఇవ్వొద్దు.
  •  పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. 
  •  సాధారణ పౌరులకు ట్రాఫిక్ సమస్య లేకుండా జాగ్రత్తపడాలి. 
  • మద్యం అనుమతించే ఈవెంట్స్‌లో మైనర్లకు అనుమతి లేదు. 
  • వేడుకల్లో డ్రగ్స్ వాడినా, వేడుకలకు అనుమతించిన సమయం ముగిసిన తర్వాత లిక్కర్ సరఫరా చేసినా కఠిన చర్యలు. 
  • మ‌ద్యం తాగి వాహ‌నాలు న‌డ‌పరాదు. ఒక వేళ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబ‌డితే రూ. 10 వేలు జ‌రిమానా, ఆర్నెళ్లు జైలు శిక్ష.