Farhana controversy: ఫర్హానా వివాదం.. నటి ఐశ్వర్య రాజేష్ ఇంటికి పోలీసు భద్రత

Farhana controversy: ఫర్హానా వివాదం.. నటి ఐశ్వర్య రాజేష్ ఇంటికి పోలీసు భద్రత

నటి ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ ఫర్హానా.  ఐశ్వర్య రాజేష్ ముస్లిం యువతిగా నటించిన ఈ మూవీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుండే వివాదం మొదలైంది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ముస్లిం సంఘాలు ఆరోపించాయి. ఈ మేరకు సినిమా రిలీజ్ ను ఆపాలని చెన్నైలోని పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా నమోదయ్యాయి.

అయితే.. తాజాగా సినిమా రిలీజ్ తరువాత ఈ వివాదం ఇంకా రాజుకుంది. ఈ క్రమంలోనే.. నటి ఐశ్వర్య రాజేష్ ఇంటికి పోలీస్ లు కాపాలా విధించారు. ఆమె ఇంట్లోకి ఎవరిని అనుమతించడం లేదు. ప్రస్తుతం న్యూస్ తమిళనాడువ్యాప్తంగా చర్చనియ్యాంశం అయ్యింది. అయితే ఇదే ఇష్యూపై మూవీ మేకర్స్ ఒక ప్రకటన కూడా విడుదల చేసారు. ఈ సినిమా ఎవరి మనోభావాలను కించపరచడానికి తీయలేదు అని, అది తమ ఉద్దేశం కాదని, నిజంగా సినిమాలో అలాంటి సన్నివేశాలు ఉంటె తొలగించడానికి కూడా సిద్ధమే అని వారు ప్రకటనలో చెప్పుకొచ్చారు.

మరి ఈ ప్రకటనపై ముస్లిం సంఘాలు ఎలా స్పందిస్తాయో చూడాలి మరి.