చిరంజీవి ఇంటివద్ద పోలీస్ బందోబస్త్

చిరంజీవి ఇంటివద్ద పోలీస్ బందోబస్త్

హీరో చిరంజీవి ఇంటివద్ద పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు. అమరావతి పరిరక్షణ జేఏసీ ఆద్వర్యంలో చిరంజీవి ఇంటిని ముట్టడిస్తారన్న వార్త ప్రచారంలోకి రావడంతో చిరంజీవి ఇంటికి అభిమానులు చేరుకున్నారు. దీంతో పాటు ఇంటిని ముట్టడిస్తే ఊరుకునేది లేదని తెలిపారు అభిమానులు. అయితే ఈ విషయంపై అమరావతి పరిరక్షణ జేఏసీ స్పందించింది. తాము చిరంజీవి ఇంటిని ముట్టడించడం లేదని అది కేవలం రూమర్ మాత్రమేనని చెప్పారు. తన సినిమాలు తాను చేసుకుంటున్న చిరంజీవి ఎందుకు అమరావతిపై స్పందించాలని ప్రశ్నించారు ఆయన ఫ్యాన్స్.