కౌంటీల్లో కుమ్మేస్తోన్నతిలక్ వర్మ.. ఎసెక్స్‌‎పై సూపర్ సెంచరీ

కౌంటీల్లో కుమ్మేస్తోన్నతిలక్ వర్మ.. ఎసెక్స్‌‎పై సూపర్ సెంచరీ

లండన్‌‌‌‌‌‌‌‌: టీమిండియా స్టార్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌ తిలక్‌‌‌‌‌‌‌‌ వర్మ కౌంటీల్లో అదరగొడుతున్నాడు. కౌంటీ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ డివిజన్‌‌‌‌‌‌‌‌–1లో భాగంగా హాంప్‌‌‌‌‌‌‌‌షైర్‌‌‌‌‌‌‌‌కు ఆడుతున్న తిలక్‌‌‌‌‌‌‌‌ (100).. ఎసెక్స్‌‌‌‌‌‌‌‌తో జరుగుతున్న మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా మంగళవారం రెండో రోజు హాంప్‌‌‌‌‌‌‌‌షైర్‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 138.1 ఓవర్లలో 453 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. 164 రన్స్‌‌‌‌‌‌‌‌కే 4 కీలక వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన తిలక్‌‌‌‌‌‌‌‌.. లియామ్‌‌‌‌‌‌‌‌ డాసన్‌‌‌‌‌‌‌‌ (139)తో కలిసి ఐదో వికెట్‌‌‌‌‌‌‌‌కు 133 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను నిలబెట్టాడు. 

ఫ్లెట్చా మిడిల్టన్‌‌‌‌‌‌‌‌ (61), బెన్‌‌‌‌‌‌‌‌ బ్రౌన్‌‌‌‌‌‌‌‌ (42), టామ్‌‌‌‌‌‌‌‌ ప్రీస్ట్‌‌‌‌‌‌‌‌ (41) రాణించారు. ఎసెక్స్‌‌‌‌‌‌‌‌ బౌలర్‌‌‌‌‌‌‌‌ మ్యాట్‌‌‌‌‌‌‌‌ క్రిచ్లి 4, సామ్‌‌‌‌‌‌‌‌ కుక్‌‌‌‌‌‌‌‌ 3 వికెట్లు తీశారు. అంతకుముందు ఎసెక్స్‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 98.1 ఓవర్లలో 296 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. చార్లీ అలిసన్‌‌‌‌‌‌‌‌ (101), మ్యాట్‌‌‌‌‌‌‌‌ క్రిచ్లి (71), సిమోన్‌‌‌‌‌‌‌‌ హర్మర్‌‌‌‌‌‌‌‌ (45) మెరుగ్గా ఆడారు. కైల్‌‌‌‌‌‌‌‌ అబాట్‌‌‌‌‌‌‌‌ 5 వికెట్లు పడగొట్టాడు.