90 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత

90 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత

అన్నపురెడ్డిపల్లి, వెలుగు : రేషన్​ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని గురువారం అన్నపురెడ్డిపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురిపై కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  ఏపీలోని కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన మణికంఠ మండలంలోని గుంపెన రేషన్​ బియ్యాన్ని , కాకినాడ కు చెందిన వెంకట్రావుకు సరఫరా చేసేందుకు తన డీసీఎం వాహనంతో గురువారం తెల్లవారు జామున బయలుదేరాడు. పక్కా సమాచారంతో గ్రామ శివారు ప్రాంతంలో పోలీసులు వాహనాన్ని పట్టుకున్నారు.

అందులో సుమారు రూ.1.17 లక్షల విలువైన 90 క్వింటాల రేషన్​ బియ్యం ఉన్నట్లు గుర్తించి, వాహనాన్ని స్టేషన్​ కు తరలించారు. కాకినాడకు చెందిన మణికంఠ, ముత్యాలరాజు, వెంకట్రావు తో పాటు కట్టుగూడెం గ్రామానికి చెందిన దుకాణ నిర్వహకులు మిడియం తులిసమ్మ, అజీమ్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చంద్రశేఖర్​ తెలిపారు.

10 క్వింటాళ్లు.. 

అశ్వాపురం : మణుగూరు నుంచి ఏపీలోని చింతూరుకు అక్రమంగా తరలిస్తున్న పది క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అశ్వాపురంలో పోలీసులు పట్టుకున్నారు. మణుగూరుకు చెందిన ఉత్పత్తుల నరసింహారావు ప్రజల వద్ద నుంచి సేకరించిన 10 గంటల రేషన్ బియ్యాన్ని టాటా ఎస్​ వాహనంలో తరలిస్తుండగా అశ్వాపురం పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్ రెడ్డి తెలిపారు.