పాల్వంచలో .. కారులో 2 క్వింటాళ్ల గంజాయి పట్టివేత

పాల్వంచలో .. కారులో 2 క్వింటాళ్ల గంజాయి పట్టివేత

పాల్వంచ రూరల్, వెలుగ: పాల్వంచలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో ఓ కారులో రెండు క్వింటాళ్ల గంజాయి పట్టుబడింది. పట్టణంలోని జీసీసీ గూడం వద్ద పట్టణ ఎస్సై రాము, రాఘవులు బుధవారం వాహన తనిఖీలు చేపట్టారు. టాటాఇండికా కారులో 202 కేజీల గంజాయిని గుర్తించారు. 

వీటి విలువ  రూ.50.55 లక్షల వరకు ఉంటుందని ఎస్సై తెలిపారు. గంజాయితోపాటు కారును ఠాణాకు తరలించి నిందితుడు జైపాల్​ పై కేసు  నమోదు చేసినట్లు చెప్పారు. ఏపీలోని డొంకరాయి అటవీ ప్రాంతం నుంచి పాల్వంచ మీదుగా కొత్తగూడెంకు గంజాయిని తరలిస్తున్నారన్నారు.