ఫ్లాగ్ డే : పోలీసులది నిస్వార్థ సేవ.. శాంతిభద్రతల పరిరక్షణలో కీలకపాత్ర

ఫ్లాగ్ డే :  పోలీసులది నిస్వార్థ సేవ.. శాంతిభద్రతల పరిరక్షణలో  కీలకపాత్ర

పరిగి, వెలుగు: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిస్వార్థంగా పనిచేస్తారని వికారాబాద్​ ఎస్సీ  కె.నారాయణరెడ్డి, పరిగి ఎమ్మెల్యే టి.రాంమ్మోహన్​రెడ్డి అన్నారు. ఫ్లాగ్​ డేను పురస్కరించుకుని బుధవారం పరిగిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు హాజరై మాట్లాడారు. సమాజానికి రక్షణగా నిలిచి, విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన పోలీసులు సేవలు చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో పరిగి డీఎస్పీ శ్రీనివాస్​, సీఐ శ్రీనివాస్​రెడ్డి, డివిజన్​ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.