
కరీంనగర్ క్రైం,వెలుగు: కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో మూత్రం పోశాడని ఓ వ్యక్తిని పోలీసులు లాఠీలతో దాడిచేసి చితకబాదారు . వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ కు చెందిన పరశురాం(58), కూలీ పని చేసుకుంటూ రోడ్లపైన ఉంటుంటాడు.
బుధవారం (అక్టోబర్ 15) రాత్రి తాగిన మత్తులో బస్టాండ్ ఆవరణలో అతను మూత్ర విసర్జన చేశాడు. దీంతో పోలీసులు కొట్టడడంతో అతడి చేయి విరిగింది. బాధితుడు వన్ పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా.. చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి పంపించారు.
విరిగిన చేయికి సర్జరీ చేయాలని డాక్టర్లు తెలిపారు. కొట్టిన పోలీసులను గుర్తించేందుకు వన్ టౌన్ పోలీసులు బస్టాండ్ ఆవరణలోని సీసీ కెమెరాలను చెక్ చేస్తున్నారు.