చిన్నారి వైద్యం కోసం ఒలంపిక్స్ మెడల్ వేలం

చిన్నారి వైద్యం కోసం ఒలంపిక్స్ మెడల్ వేలం

ఒలింపిక్స్ లో  మెడల్ గెలవడం  క్రీడాకారులకు  లైఫ్ టైమ్  డ్రీమ్. గెలిచిన పతకాన్ని అపురూపంగా  చూసుకుంటారు  క్రీడాకారులు. పోలండ్ కు  చెందిన జావెలిన్  త్రోయర్ ...మరియా ఆండ్రెజిక్  టోక్యో ఒలింపిక్స్ లో  సిల్వర్ మెడల్  గెలిచింది. రియో ఒలింపిక్స్ లో ఫోర్త్ ప్లేస్ లో  నిలిచిన మరియా... టోక్యోలో   64.61 మీటర్లు విసిరి  రజతం పట్టేసింది. కానీ  ఓ 8 నెలల  బాబు  గుండె ట్రీట్మెంట్  కోసం... తాను ఐదేళ్లు  కష్టపడి గెలిచిన  మెడల్ ను  వేలానికి పెట్టింది  మరియా ఆండ్రెజిక్. ఆ మెడల్ ను  పోలండ్ కు  చెందిన  అబ్కా పొల్సాకా  అనే కంపెనీ ... లక్షా 25వేల డాలర్లకు  వేలంలో దక్కించుకుంది.  ఆ డబ్బును  పిల్లాడి సర్జరీ కోసం  స్టాన్ ఫోర్డ్  యూనివర్సిటీ  హాస్పిటల్ కు  పంపింది మరియా. మరోవైపు  వేలంలో తాము  కొనుగోలు చేసిన  మెడల్ ను మళ్లీ  మరియాకే  ఇచ్చేసింది  అబ్కా పొల్సాకా కంపెనీ.  ఇలా తన   జీవిత కాల లక్ష్యాన్ని  పసికందు కోసం  వేలం వేసి  డబ్బు సమకూర్చిన మరియా  గొప్పమనసు  చాటుకోగా... ఆమె మెడల్ ను  ఆమెకే తిరిగిచ్చేసిన  అబ్కా పొల్సాకా కంపెనీ ...ఉదారత ప్రదర్శించింది.