జార్ఖండ్లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం

జార్ఖండ్లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం

జార్ఖండ్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. యూపీఏ ఎమ్మెల్యేలంతా క్యాంప్లలో గడుపుతున్నారు. రాంచీలోని హేమంత్ సోరెన్ నివాసం నుంచి యూపీఏ ఎమ్మెల్యేలంతా క్యాంప్ కు బయల్దేరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సోరెన్ తనకు తానే గనుల కేటాయింపు జరుపుకోవడం వివాదాస్పదంగా మారింది. ముఖ్యమంత్రి సోరెన్  ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న గవర్నర్ ఈసీకి  సిఫారసు చేశారు.  దీంతో తన ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేపట్టిన సీఎం సోరెన్.. ఎమ్మెల్యేలనంతా క్యాంపులకు తరలిస్తున్నారు.