అప్పట్లో ఎన్టీఆర్ సభ.. ఇప్పుడు ప్రభాస్ మానియా.. తిరుపతి ఈవెంట్పై పొలిటికల్ చర్చ

అప్పట్లో ఎన్టీఆర్ సభ.. ఇప్పుడు ప్రభాస్ మానియా.. తిరుపతి ఈవెంట్పై పొలిటికల్ చర్చ

కొండపైన వెంకన్న, కొండ కింద ఆదిపురుష్ (Adipurush) ఈవెంట్.. ఇసకేస్తే రాలనంత జనం, లక్షలాది మంది అభిమాన సందోహం, ఎక్కడ చూసినా జై శ్రీరామ్ జై శ్రీరామ్(Jai Shreeram).. జిందాబాద్ ప్రభాస్ నినాదాలు. ఇవి నిన్న తిరుపతిలో జరిగిన ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్(Adipurush pre release event)లో కనిపించిన దృశ్యాలు, డైలాగ్స్, నినాదాలు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) రాముడిగా చేస్తున్న ఆదిపురుష్ మూవీ జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర ప్రమోషన్స్లో భాగంగా జూన్ 6న తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ కు ఊహించని విధంగా.. అనూహ్య స్పందన రావటం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. తిరుపతి ఈవెంట్ కు కనీసంలో కనీసం లక్ష మందిపైనే వచ్చారు. ఓవరాల్ గా లక్షన్నర మందిపైనే ఉంటారని అంచనా.

Also Read:మంత్రి కేటీఆర్ ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క

ఇలాంటి  ఈవెంట్స్ కు ఫ్యాన్స్ రావటం కామన్.. ఇక్కడ ఓ ఇంట్రస్టింగ్ టాపిక్ నడుస్తుంది. పెద్దలు, మహిళలు తమ పిల్లలతో సహా సినిమా ఫంక్షన్ కు తరలి రావటం అనేది ఆసక్తి రేపుతోంది. 50 నుంచి 70 వేల మంది మధ్యలో జనం వస్తారనే అంచనాతో పోలీసులు సైతం అందుకు తగ్గట్టు సెక్యూరిటీ, ట్రాఫిక్ డైవర్షన్స్ ఏర్పాటు చేశారు. అందుకు రెండింతలు రావటంతో పోలీసులకు భద్రత కల్పించటం తలకు మించిన భారం అయ్యింది. 

ఓ సినిమా ఈవెంటకు తిరుపతి జనం మొత్తం తరలి రావటం అనేది రాజకీయంగా చర్చనీయాంశం అయ్యింది. తిరుపతిలో ఇప్పటి వరకు జరిగిన సభల్లో రెండే రెండు సభలు హైలెట్.. ఒకటి పెద్ద ఎన్నీఆర్ మేజర్ చంద్రకాంత్ సక్సెస్ సభ.. రెండోది చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు సభ. అప్పట్లో ఆ రెండు సభలకు వచ్చిన జనం చూసి నోరెళ్లబెట్టారు. మళ్లీ ఇన్నాళ్లకు ప్రభాస్ ఆదిపురుష్ సభకు లక్షల్లో జనం తరలిరావటం.. అందులోనూ మహిళలు ఉండటం చర్చకు దారి తీస్తుంది. ఆదిపురుష్ సినిమా పురాణాలకు సంబంధించినది.. రాజకీయాలకు, రెగ్యులర్ కథలకు అతీతం. అలా అని సినిమా సభ కాకుండా పోదు కదా.  

అయితే ఈ ఈవెంట్ ను గతంలో జరిగిన ఎన్టీఆర్, చిరంజీవి సభలతో పోల్చి చూస్తున్నారు ఆప్పటి రాజకీయ నాయకులు, పెద్దలు. ఇక ఈ ఈవెంట్ కు తిరుపతి వాళ్లే కాకుండా ఏపీ, తెలంగాణ నుంచి ప్రత్యేక బస్సుల్లో రైళ్లలో.. విమానాల్లో తరలివెళ్లారు అభిమానులు. అంతే కాకుండా చెన్నై, బెంగళూరు నుంచి ప్రత్యేక బస్సులు వేసుకుని మరీ ఆదిపురుష్ ఈవెంట్ కు రావటం చూస్తుంటే ప్రభాస్ మానియా ఏంటో స్పష్టం అవుతుంది. 

కేవలం సినిమా ఈవెంట్ గానే కాకుండా.. పొలిటికల్ సర్కిల్స్ లో డిస్కషన్ జరగటం అనేది ఇప్పుడు కొత్త పాయింట్, సెంటిమెంట్ అయ్యింది. తిరుపతి ఈవెంట్ తర్వాత జరిగే భద్రాచలంలో జరిగే ఈవెంట్ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో.. అది కూడా తిరుపతి రేంజ్ లోనే సక్సెస్ అయ్యి.. లక్షల మంది వస్తే మాత్రం.. సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా.. రాజకీయంగానే మరింత హాట్ టాపిక్ కానున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.