ఫేస్ బుక్ కు పొలిటికల్ హీట్

ఫేస్ బుక్ కు పొలిటికల్ హీట్

వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్‌‌తో కాంగ్రెస్‌ బీజేపీ మధ్య ఫైట్‌‌

దేశానికి ఓ తీరుగా ఫేస్ బుక్ రూల్స్: కాంగ్రెస్

హేట్ స్పీచ్ లు, వయోలెన్స్ ను ప్రోత్సహించబోమన్న ఫేస్ బుక్

గ్లోబల్ గా ఒకేరకమైన పాలసీ ఫాలో అవుతామని వెల్లడి

న్యూఢిల్లీ: సోషల్ మీడియా జయంట్ ఫేస్ బుక్ ను పొలిటికల్ హీట్ తాకింది. బిగ్గెస్ట్​ మార్కెట్ అయిన ఇండియాలో రూలింగ్ పార్టీకి అనుకూలంగా హేట్ స్పీచ్ పాలసీని మార్చిందంటూ వచ్చిన ఓ రిపోర్ట్​ ఆ కంపెనీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ విషయంపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలకు దిగారు. ఫేస్ బుక్ ను బీజేపీ కంట్రోల్ చేస్తోందంటూ కాంగ్రెస్.. ఫేస్ బుక్ ను వాడుకునేందుకు కాంగ్రెస్ 2019 ఎన్నికల టైమ్ లోనే ప్రయత్నించింది అటూ బీజేపీ విమర్శలకు దిగడంతో వివాదం మరింత ముదిరింది. అయితే ఈ విమర్శలపై ఫేస్ బుక్ క్లారిటీ ఇచ్చింది. తమ కంపెనీ వయోలెన్సుకు తావిచ్చే ఎలాంటి హేట్ స్పీచ్ లను, కంటెంట్ ను ప్రోత్సహించదని, ఈ పాలసీలు గ్లోబల్ గా ఒకేలా ఉంటాయని, ఏ పొలిటికల్ పార్టీకో లేదా సంస్థకో అనుకూలంగా ఉండదని స్పష్టం చేసింది.

వివాదం రేపిన వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్

వాల్ స్ట్రీట్ జర్నల్ లో ఇటీవల వచ్చిన ఓ రిపోర్ట్​ ఈ మొత్తం వివాదానికి కారణమైంది. ఇండియాలో ఫేస్ బుక్ పబ్లిక్ పాలసీ ఎగ్జిక్యూటివ్ అంకి దాస్.. బీజేపీ లీడర్ల అకౌంట్లకు హేట్ స్పీచ్ రూల్సు అప్లై చేయడానికి వ్యతిరేకించినట్టు ఆ రిపోర్ట్​ పేర్కొంది. మరో ముగ్గురు బీజేపీ లీడర్లు, గ్రూపులు వయోలెన్స్ ను ప్రోత్సహిస్తున్నట్టు ఇంటర్నల్ గా గుర్తించినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిపింది. బీజేపీ నేతలపై చర్యలు తీసుకున్నట్లయితే దేశంలో తమ కంపెనీ బిజినెస్ దెబ్బతింటుందని దాస్ చెప్పినట్టు వాల్ స్ట్రీ ట్ జర్నల్ వెల్లడించింది. కమ్యూనల్ వయోలెన్స్ ను ప్రోత్సహించేలా పోస్టులు పెడుతున్న తెలంగాణకు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యేను పర్మినెంట్ గా బ్యాన్ చేయాలన్న ఇంటర్నల్ ప్రతిపాదనను మన దేశంలోని ఒక సీనియర్ పాలసీ ఎగ్జిక్యూటివ్ అడ్డుకున్నారని ఎఫ్ బీ ఇన్ సైడ్ వర్గాల సమాచారమని వాల్ స్ట్రీ ట్ పేర్కొంది.

నాకు ప్రాణహాని ఉంది: అంకి దాస్

ఈ వివాదానికి కేంద్ర బిందువైన ఫేస్ బుక్ ఎగ్జిక్యూటివ్ అంకిదాస్.. తనకు ప్రాణ హాని ఉందంటూ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను చంపుతామంటూ సోషల్ మీడియాలో బెదిరింపులు వస్తున్నాయంటూ ఐదుగురి పేర్లను తన కంప్లయింట్ లో ప్రస్తావించింది. తనను చంపుతామని బెదిరించడంతో పాటు కొందరు తనపై అభ్యంతరకర పోస్ట్‌‌‌‌‌‌‌‌లు పెడుతున్నారని ఢిల్లీ పోలీస్‌‌‌‌‌‌‌‌ సైబర్‌‌‌‌‌‌‌‌వింగ్ కు కంప్లయింట్ చేశారు. తనను బెదిరిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేయాలని, తనకు రక్షణ కల్పించాలని కోరారు.

డెమోక్రసీకి డేంజర్: కాంగ్రెస్

హేట్ కంటెంట్ పై ఫేస్ బుక్ చర్యలు తీసుకోకపోవడం వల్ల దేశంలో డెమోక్రసీ ప్రమాదంలో పడుతోందని కాం గ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. వాల్ స్ట్రీట్ జర్నల్ ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాం డ్ చేసింది. ‘‘ఫేస్ బుక్ ఒక్కో దేశంలో ఒక్కో రూల్ అమలుచేస్తోంది. అది అమోద యోగ్యం కాదు. వారి కన్వీనియెంట్ ను బట్టి వాటిని మారుస్తున్నారు. మన దేశంలో ఫేస్ బుక్ సేఫ్టీ టీమ్స్ ఇంటర్నల్ గా కంప్లైంట్ చేసినా, రెడ్ ఫ్లాగ్ ఇచ్చినా, బయటి నుంచి కంప్లైంట్లు వచ్చినా .. హేట్ కంటెంట్ కు కావాలనే అనుమతిచ్చింది. అమెరికా, టర్కీ మొదలైన దేశాల్లో పేజీలను తొలగించింది. కానీ అలా ఇండియాలో ఎందుకు చేయడంలేదు”అని కాం గ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాథ్ ప్రశ్నించారు. వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్​పై ఫేస్ బుక్ నుంచి వివరణ కోరతామని ఐటీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శశిథరూర్ చెప్పారు.

క్లారిటీ ఇచ్చిన ఫేస్ బుక్

వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్​పై ఫేస్ బుక్ స్పందించింది. తమ కంపెనీ వయోలెన్స్ కు తావిచ్చే ఎలాంటి హేట్ స్పీచ్ లను గానీ, కంటెంట్ నుగానీ ప్రోత్సహించదని స్పష్టం చేసింది. ఈ పాలసీలు గ్లోబల్ గా ఒకే విధంగా ఉంటాయని, ఏ పొలిటికల్ పార్టీకో లేదా సంస్థకో అనుకూలంగా ఉండదని పేర్కొంది. అయితే తాము చేయాల్సింది ఇంకా చాలా ఉందని, హేట్ పాలసీకి సంబంధించి తరచుగా ఆడిట్ చేస్తున్నామని, ఖచ్చితత్వం, నిజాయితీ కోసమే ఈ ప్రాసెస్ అనుసరిస్తున్నామని ఫేస్ బుక్ పేర్కొంది. మన దేశంలో ఎఫ్ బీ కి 40 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు. అతి పెద్ద మార్కెట్ మన దేశమే. దీనిని మరింత పెంచుకునేందుకు ముఖేశ్ అంబానీ కంపెనీ జియో ప్లాట్ ఫామ్ లో ఫేస్ బుక్ రూ.43,574 కోట్ల పెట్టుబడి పెట్టింది.