ఓటర్లకు హైటెక్ పద్దతిలో మనీ ట్రాన్స్ ఫర్

ఓటర్లకు హైటెక్ పద్దతిలో మనీ ట్రాన్స్ ఫర్

పోలింగ్ సమయం ముంచుకొస్తోంది. దీంతో ప్రలోభాలకు తెర లేస్తోంది. ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టేందుకు అభ్యర్థులు నగదు పంపిణీకి హైటెక్‌ ఏర్పాట్లు చేస్తున్నారు . గూగుల్‌ పే, పేటీఎం, ఫోన్‌పే, భీమ్‌ తదితర యాప్‌ లు, ఆన్‌ లైన్‌ మనీ ట్రాన్స్‌ ఫర్‌ద్వారా నగదు బదిలీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.ఇందుకోసం పార్టీల కార్యకర్తలు బూత్‌ లవారీ గా ఇంటింటికీ తిరిగి ఓటర్ల ఫోన్‌ నంబర్లు, బ్యాంకుఖాతాల నంబర్లను సేకరిస్తున్నారు. స్థానిక నేతలు ఈ వివరాలను పార్టీ అభ్యర్థులకు చేరవేస్తూ నగదుబదిలీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్ని కలకు మూడురోజులు మాత్రమే మిగలడంతో ఈ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. బస్తీలు, కాలనీలవాసుల్లో తొంభై శాతానికి పైగా జన్‌ ధన్‌ ఖాతాలు, బ్యాంకు ఖాతాలుండటంతో తమ పని సులువవుతోందని ఆయా పార్టీల నేతలు చెబుతున్నారు.

రూ.500 నుం చి రూ.4 వేలకు

కీలక నేతలు కార్పొరేటర్లు, సర్పంచ్‌ లు, జెడ్పీటీసీలు,ఎంపీటీసీ లను డివిజన్లు , బూత్‌ ల వారీగా ఇన్‌చార్జులుగా నియమించి పంపిణీ బా ధ్యతలు అప్పగిస్తున్నారు. కులాలు, మతాలు, మహిళా సంఘాల వారీగా ఓట్లను కొనుగోలు చేసేందుకు యత్ని స్తున్నారు.కోట్లాది రూపాయాలు ఇప్పటికే నియోజకవర్గాలకుచేరాయి. మొదటి విడతలో దగ్గరి వ్యక్తులకు డబ్బులు పంచుతున్నట్లు తెలుస్తోంది. ప్రాంతాన్ని బట్టి ఓటుకు రేటు కడుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఓటుకు రూ.500 నుంచి రూ.2 వేల వరకు, మరికొన్ని ప్రాంతాల్లో రూ.2 నుం చి రూ.4 వేలకు ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గ్రామీణప్రాంతాల్లో రూ.500, పట్టణ ప్రాంతాల్లో కనీసం రూ.2 వేలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం.

ఈసీకి చిక్కకుండా, ఓట్లర్లం దరికీ చేరేలా..

ప్రచారం ముగిసిన నాటి నుంచి మొదలయ్యే పంపకాల వ్యవహారం పోలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ముగిసేదాకా కొనసాగుతుంది. ఓటర్లకు పంపిణీ చేసేందుకు పార్టీ నేతల చేతుల్లో డబ్బు పెడితే కింది వరకు వెళ్లడం లేదనిఅభ్యర్థులు భయపడుతున్నారు. అదీగాక ఈసీ గట్టిగానిఘా వేస్తోంది. దీంతో కుల సంఘాలు, మహిళాసంఘాలకు బల్క్‌ గా ఆన్‌ లైన్‌ బదిలీలు చేయడానికిరంగం సిద్ధం చేసినట్లు సమాచారం. పార్టీలు బలంగాఉన్న ప్రాంతాల్లో డబ్బుల పంపిణీ మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉంది.

చీరలు, క్రికెట్ కిట్లు, ఫోన్లు

మహిళలకు చీరలు, యువకులకు క్రికెట్కిట్లు , టీ షర్టులు, స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోన్లు కూడా పంపిణీచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. కుల సంఘాలతో రహస్యంగా సమావేశమై కమ్యూనిటీ హాళ్లు, మండపాలు నిర్మి-స్తామని, వంట సా మగ్రి అందిస్తామని హామీఇస్తున్నారు. ఇందుకు సంబంధించి ముందేకొంత డబ్బు కూడా ము ట్టజెపుతున్నట్లు సమాచారం. ఎన్నికల నిబంధనల ప్రకారం ఈనెల 9వ తేదీతో ప్రచారం ము గియనుంది.దీంతో చివరి రెండు రోజులు అభ్యర్థులకుకీలకం కానున్నాయి.