అవసరాల కోసం పార్టీ మారుతున్నారు : కోదండరామ్‌

అవసరాల కోసం పార్టీ మారుతున్నారు : కోదండరామ్‌

ప్రజల అవసరాల కోసం రాజకీయాలు మారాలన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరామ్‌. నాంపల్లిలోని తెలంగాణ జన సమితి లో ప్రెస్ మీట్ ఆయన మాట్లాడారు. జులై 13న హైదరాబాద్‌లో తెలంగాణ జనసమితి ప్లీనరీ నిర్వహిస్తామన్నారు. పార్టీ ఫిరాయింపులతో రాజకీయాలు భ్రష్టుపట్టాయన్న కోదండరాం… ఎవరి అవసరాల కోసం వారు పార్టీ మారుతున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తామన్నారు. వెల్ఫేర్ హాస్టల్ భవనాలు కడుతామంటూ 1800 కోట్లు బడ్జెట్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం…400 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదన్నారు. ఉన్న సెక్రటేరియట్ కూల్చి మళ్ళీ కొత్త సెక్రటేరియట్ కడుతామంటే ఎలా అని ప్రశ్నించారు. నదుల అనుసంధానం పేరుతో విభజన సమస్యలు పక్కన పెడుతున్నారన్నారు. ఉద్యోగుల విభజన జరగక వారు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. హడావిడిగా నదుల అనుసంధానం వద్దన్న కోదండరాం..కృష్ణానదిపై భారం తగ్గించేలా ప్రాజెక్టులు కట్టాలన్నారు.