
రాజకీయం అంటే కోట్ల రూపాయలతో కూడిన ఖర్చన్నారు లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ. అందుకే తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం బాగా పెరిగిపోయిందని విమర్శించారు. రానున్న రోజుల్లో అనేక రాష్ట్రాల్లో సంక్షోభం రానుందన్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో విఫలమైందన్నారు. తాను పార్టీని స్థాపించింది పదవుల కోసం కాదని స్పష్టం చేశారు జయప్రకాష్ నారాయణ.