
సెక్రటేరియట్ : రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత సమస్యాత్మక నియోజకవర్గాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 13 నియోజకవర్గాల్లో పోలింగ్ గడువు పూర్తయింది. పొద్దున 7 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు అధికారులు. సాయంత్రం నాలుగింటి వరకు పోలింగ్ స్టేషన్లలో లైన్ లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అనుమతిస్తామని అధికారులు చెప్పారు.
4 గంటలకే పోలింగ్ ముగిసిన నియోజకవర్గాలు
ఆదిలాబాద్ ఎస్టీ – సిర్పూర్, ఆసిఫాబాద్
పెద్దపల్లి ఎస్సీ – చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల్, మంథని
వరంగల్ ఎస్సీ – భూపాలపల్లి
మహబూబాబాద్ ఎస్టీ – ములుగు, పినపాక, యెల్లందు, భద్రాచలం
ఖమ్మం – కొత్తగూడెం, అశ్వారావుపేట్