కరీంనగర్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ అద్భుతం : బండి సంజయ్ కుమార్

 కరీంనగర్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ అద్భుతం : బండి సంజయ్ కుమార్
  • కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ 

కరీంనగర్, వెలుగు: ఆధునీకరణలో భాగంగా కరీంనగర్ రైల్వేస్టేషన్ అద్భుతంగా మారిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ ప్రజలంతా ప్రధానికి రుణపడి ఉంటారని చెప్పారు. 10 ఏళ్ల కింద రైల్వే స్టేషన్ల దుస్థితి ఎట్లుందో అందరికీ తెలుసునని, ప్రస్తుతం రైల్వే స్టేషన్ల రూపురేఖలే మారిపోతున్నాయని వ్యాఖ్యానించారు.

ఈనెల 22న పీఎం నరేంద్రమోదీ రాష్ట్రంలోని కరీంనగర్, బేగంపేట, వరంగల్ రైల్వేస్టేషన్లతోపాటు దేశవ్యాప్తంగా 102 రైల్వే స్టేషన్లను వర్చువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆధునీకరణ పనులను, స్టేషన్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్రమంత్రి బండి సంజయ్ కరీంనగర్ రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 
సందర్శించారు. 

ఉప్పల్ ఆర్వోబీని ఇంకెన్నాళ్లు సాగదీస్తారు?

జమ్మికుంట ఉప్పల్ ఆర్వోబీ నిర్మాణ పనుల జాప్యంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోమారు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ పనుల పరిశీలన సందర్భంగా సంబంధిత రైల్వే అధికారులను పిలిపించుకున్నారు. సదరు కాంట్రాక్టర్ తో ఫోన్ మాట్లాడి పనుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ నాటికి వన్ లైన్ పనులు పూర్తి చేయకపోతే తానే అక్కడికి వచ్చి జేసీబీతో ఆర్వోబీని కూల్చివేయిస్తానని హెచ్చరించారు. 

ఆలస్యం జరిగినందుకు అక్కడి ప్రజలకు క్షమాపణ కోరతానన్నారు. తీగలగుట్టపల్లి ఆర్వోబీ పనులు నత్తనడకన కొనసాగుతుండటంపైనా కేంద్ర మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఆయన వెంట కరీంనగర్, పెద్దపల్లి బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, సంజీవరెడ్డి, మాజీ మేయర్లు సునీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, డి.శంకర్, మాజీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్,  1వ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్థానిక రైల్వే అధికారులు, నాయకులు ఉన్నారు. 

బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న కేంద్రమంత్రి 

కొత్తపల్లి, వెలుగు: కొత్తపల్లి మండలం బద్దిపల్లిలో జరుగుతున్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వచనం అందించారు. అంతకుముందు మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం వంతడుపులలో నవీన్ కుమార్ పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. 'ఆపరేషన్ సింధూర్'లో కశ్మీర్ లోని కేరీ బెటాలియన్ లో సేవలందించిన జవాన్ నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కేంద్రమంత్రి సన్మానించారు.