
- ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్
గోదావరిఖని, వెలుగు: రామగుండం, మంచిర్యాల ప్రాంతాల్లో నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఈ విషయంలో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్రాజ్ఠాకూర్, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్ తెలిపారు. నోబుల్ఎడ్యుకేషన్ ఎంపవర్‌మెంట్ సొసైటీ సౌజన్యంతో సింగరేణి ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియంలో ఆదివారం మెగా జాబ్‌మేళా నిర్వహించారు. ఈ జాబ్‌మేళాను సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో వివిధ శాఖల్లో 60 వేల ఉద్యోగాలిచ్చామన్నారు. నిరుద్యోగ సమస్యను అరికట్టేందుకు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు జాబ్‌మేళా నిర్వహించినట్లు చెప్పారు.
సీఎండీ బలరామ్ మాట్లాడుతూ సింగరేణి ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం పట్టణంలోని తిలక్‌నగర్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేశామని, దీని ద్వారా 100 మందికి శిక్షణ ఇప్పించి ఉపాధి అవకాశాలు కల్పించినట్లు చెప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ జాబ్ మేళాలో 4,800 మంది నిరుద్యోగ యువత పాల్గొనగా, 100కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని బ్యాంకింగ్, మార్కెటింగ్, ఫైనాన్స్, హెల్త్‌కేర్, ఐటీ, రిటైల్ తదితర రంగాల్లో 2,826 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించాయి.
ఆర్జీ 1 ఏరియా జీఎం డి.లలిత్‌కుమార్, డైరెక్టర్లు డి.సత్యనారాయణరావు, కె.వెంకటేశ్వర్లు, ఏసీపీ ఎం.రమేశ్, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కె.రాజ్‌కుమార్, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ కె.సదానందం, అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ పెద్ది నర్సింహులు, ఏరియాల జీఎంలు, నోబెల్ ఎడ్యుకేషన్ ఎంపవర్‌మెంట్ సంస్థ ప్రతినిధి సురేశ్, తదితరులు పాల్గొన్నారు.