ఎంపీ వంశీకృష్ణకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి : సూర్యనారాయణ

ఎంపీ వంశీకృష్ణకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి  : సూర్యనారాయణ

పెద్దపల్లి, వెలుగు: సరస్వతి పుష్కరాల్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను అవమానించిన దేవాదాయశాఖ అధికారులు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్​ సీనియర్​ లీడర్​కాడే సూర్యనారాయణ  డిమాండ్​ చేశారు. పెద్దపల్లి ఎంపీకి జరిగిన అవమానాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్​ కాంగ్రెస్​ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాడే సూర్యనారాయణ మాట్లాడుతూ పెద్దపల్లి ప్రాంతం నుంచి కాకా కుటుంబం దేశానికి ఎంతో సేవ చేసిందన్నారు. 

అలాంటి కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయడానికే ఉద్దేశపూర్వకంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫొటో ఫ్లెక్సీల్లో,  శిలా ఫలకాల్లో పెట్టడం లేదన్నారు. ఎంపీకి బేషరతుగా క్షమాపణ చెప్పి, అధికారికంగా ఆహ్వానం పలకాలన్నారు.  దీని వెనుక ఉండి నడిపించినవారికి ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్పే రోజులు ముందున్నాయని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు కరాటే వేణుమాధవ్, దేవి కిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పొన్నవేని స్వామి, ఎదుల్ల అంజయ్య, ఎండీ బాబా, వెన్నం రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తదితరులు పాల్గొన్నారు.