
మొగుళ్లపల్లి, వెలుగు : జయశంకర్భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇప్పలపల్లె గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రమయ్యింది. బోరింగుల్లోనూ నీరు రాకపోవడంతో ఆదివారం గ్రామస్తులు రోడ్డెక్కారు. బిందెలు, బకెట్లతో నిరసన తెలిపారు. సమస్య పరిష్కరించాలని ఇటీవల తహసీల్దార్, ఎంపీడీవో, విలేజ్ సెక్రటరీలకు కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్తులు, ధర్మసమాజ పార్టీ లీడర్లు పాల్గొన్నారు.