ఎంపీలకు గ్రీన్‌‌‌‌, ఎమ్మెల్యేలకు పింక్‌‌‌‌ కలర్‌‌‌‌ బ్యాలెట్‌‌‌‌

ఎంపీలకు గ్రీన్‌‌‌‌, ఎమ్మెల్యేలకు పింక్‌‌‌‌ కలర్‌‌‌‌ బ్యాలెట్‌‌‌‌

ఇవాళ భారత 16వ రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్  జరగనుంది.  ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్‌‌ సిన్హా పోటీలో  ఉన్నారు. ఎన్నికకు ఇప్పటికే ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది.   ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పోలింగ్‌ కోసం పార్లమెంట్, అసెంబ్లీలో పోలింగ్‌ బూత్‌ను ఏర్పాటు చేశారు. 4,800 మందికి పైగా ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటు వేయనున్నారు. ఎంపీలకు ఆకుపచ్చ,ఎమ్మెల్యేలకు గులాబీ రంగు బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేశారు.

సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ విధానంలో ఈ ఓటింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఈసీ ఇచ్చిన పెన్ను ద్వారా మాత్రమే సభ్యులు ఓటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. పోలింగ్‌‌‌‌ తర్వాత రిప్రజంటేటివ్‌‌‌‌ల సమక్షంలో బ్యాలెట్‌‌‌‌ పేపర్‌‌‌‌ను సీల్‌‌‌‌ చేసి పార్లమెంట్ కి తరలిస్తారు..  జూలై 21న ఓట్ల లెక్కింపు జరుగనుండగా, 25వ తేదీన కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు.