నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: జిల్లాలో మూడు విడతలుగా నిర్వహించే గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద సిబ్బందికి సౌలతులు కల్పించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి కోరారు. సోమవారం అడిషనల్ కలెక్టర్ దేవసహాయంకు వినతిపత్రం అందజేశారు. టేబుళ్లు, కుర్చీలు, కరెంట్, మంచినీరు, టాయిలెట్స్, భోజన వసతి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
మండల కేంద్రాల్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కనీస వసతులు కల్పించ లేదన్నారు. గర్భిణులు, చంటి పిల్లల తల్లులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి ఎలక్షన్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.

