బొమ్మలరామారంలో పోలీసులతో వాగ్వాదం

బొమ్మలరామారంలో పోలీసులతో వాగ్వాదం

యాదాద్రి : బొమ్మలరామారం మండలం మర్యాలలో పోలీసులకు, BJP నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలింగ్ సరళిని తెలుసుకోవడానికి వచ్చిన BJP ZPTC అభ్యర్థిని పోలీసులు అడ్డుకున్నారు.

TRS ZPTC అభ్యర్థి వచ్చినప్పుడు పోలింగ్ కేంద్రంలోకి ఎందుకు అనుమతించారని BJP నేతలు వాదించారు. పోలీసులు, ఎన్నికల అధికారులు అధికార పార్టీ అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంలో పోలీసులతో కొద్దిసేపు ఘర్షణ వాతావరణం కనిపించింది.