చెన్నూర్, వెలుగు: చెన్నూర్ ఇన్చార్జి ఎఫ్ఆర్వోగా డిప్యూటీ రేంజర్ పోలోజి ప్రభాకర్ నియమితులయ్యారు. గతంలో ఇక్కడ ఎఫ్ఆర్వోగా పనిచేసిన శివకుమార్ ఈ ఏడాది మే నెలలో ప్రమోషన్ పై వెళ్లారు. అ స్థానంలో కోటపల్లి ఎఫ్ఆర్వో సదానందంకు చెన్నూర్ ఎఫ్ఆర్వోగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
కాగా చెన్నూర్ ఫారెస్ట్ డివిజన్లో డిప్యూటీ రేంజర్‌గా పనిచేస్తున్న పోలోజు ప్రభాకర్‌ను ఇన్చార్జిగా నియమిస్తూ ఉన్నతాధికారులు శనివారం ఆర్డర్స్ జారీ చేశారు. ప్రభాకర్ ఇటీవల జరిగిన చెన్నూర్ ఫారెస్ట్ డివిజన్ యూనియన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
