
కాశీబుగ్గ, వెలుగు: అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ విద్యా సంవత్సరపు పాలిసెట్ అడ్మిషన్ల ప్రక్రియ తీవ్ర గందరగోళంగా మారిందని తెలంగాణ పాలిటెక్నిక్ విద్యార్థుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ మేకల అక్షయ్ కుమార్ అన్నారు. ఆయన మాట్లాడుతూ దరఖాస్తుల స్వీకరణ తేదీ నుంచి మొదలు, కౌన్సెలింగ్, సీట్ అలాట్మెంట్ తేదీల షెడ్యూల్ ప్రకటన వరకూ అధికారులు నిర్లక్షంగా వ్యవహరించారని ఆరోపించారు.
షెడ్యూల్ ప్రకారం ఈ నెల 4లోపే జరగాల్సిన పాలిసెట్ మొదటి విడత సీట్ల కేటాయింపు ఇప్పటికీ జరగలేదన్నారు. మరోవైపు పాలీసెట్ డేటా ఎరేజ్ అయిందని వస్తున్న వార్తలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు.