పదిలమైన కెరీర్​కు.. పాలీసెట్​

పదిలమైన కెరీర్​కు.. పాలీసెట్​

ఇంజినీరింగ్​, అగ్రికల్చర్​, యానిమల్​ హస్బెండరీ డిప్లొమా కోర్సులకు టీఎస్​ పాలీసెట్​ గేట్​వేగా మారింది. టెన్త్​ తర్వాత రాసే ఈ ఎంట్రెన్స్​తో  వివిధ రకాల డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్స్​ పొందవచ్చు. ఈ ఏడాది బాసర ఆర్​జీయూకేటీ ప్రవేశాలకు కూడా పాలీసెట్​ ర్యాంకునే ప్రాతిపదికగా తీసుకోనున్నారు.
పాలిటెక్నిక్‍ కామన్‍ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్‍ పాలీసెట్‍) ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్​, ప్రైవేట్​, అన్​–ఎయిడెడ్ ఇంజినీరింగ్​ కాలేజీలతోపాటు ప్రొఫెసర్​ జయశంకర్ తెలంగాణ స్టేట్​ అగ్రికల్చరల్​ వర్సిటీ(పీజేటీఎస్​ఏయూ)​, పీవీ నర్సింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ(పీవీఎన్​ఆర్​టీవీయూ) పరిధిలోని పాలిటెక్నిక్​ కాలేజీల్లో​ అడ్మిషన్లు పొందవచ్చు. బాసరలోని రాజీవ్​గాంధీ సాంకేతిక, వైజ్ఞానిక విశ్వవిద్యాలయం(ఆర్​జీయూకేటీ)లో అడ్మిషన్లకు కూడా ఈ ఏడాది ‘పాలిసెట్​’ను ప్రాథమిక అర్హత పరీక్షగా నిర్ణయించారు.

ఇంజినీరింగ్​ డిప్లొమా
రాష్ర్టంలో స్టేట్​ బోర్డ్​ ఆఫ్​ టెక్నికల్​ ఎడ్యుకేషన్​ అండ్​ ట్రైనింగ్​ (ఎస్​బీటీఈటీ) దాదాపు 38 ఇంజినీరింగ్​ డిప్లొమా కోర్సులను ఆఫర్​ చేస్తోంది.పాలీసెట్​​ ద్వారా ఈ కోర్సుల్లో ప్రవేశాలు  కల్పిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ సంస్థలు అన్నీ కలిపి రాష్ర్టంలో దాదాపు 260 పాలిటెక్నిక్​ కాలేజీలున్నాయి. వీటిలో 40 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. డిప్లొమా తర్వాత బీటెక్/బీఈ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ స్కీం(ఈసెట్‍) ద్వారా నేరుగా సెకండియర్‌‌లో చేరొచ్చు.

ఆర్​జీయూకేటీలో 
బాసర ఆర్​జీయూకేటీ లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్​ ఇంజినీరింగ్​ కోర్సులో  ప్రవేశాలకు పాలీసెట్​ ర్యాంకునే ప్రాతిపదికగా తీసుకోనున్నారు. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్​ ఇంజినీరింగ్​ కోర్సులో ప్రీ యూనివర్సిటీ కోర్సు, బీటెక్​ రెండు కేటగిరీలు ఉంటాయి.  ప్రీ యూనివర్సిటీ కోర్సు ఇంటర్మీడియట్​ లాగా రెండేళ్ల ఎంపీసీ కోర్సు. బీటెక్​ నాలుగేళ్ల ఇంజినీరింగ్​ కోర్సు. ఇందులో కెమికల్​ ఇంజినీరింగ్​, సివిల్​, కంప్యూటర్​ సైన్స్​, ఎలక్ట్రికల్​ అండ్​ ఎలక్ట్రానిక్స్​ అండ్​ కమ్యూనికేషన్, మెటలర్జికల్​ & మెటీరియల్స్​, మెకానికల్​ ఇంజినీరింగ్​ డిసిప్లిన్​ తదితర సబ్జెక్టులు అందుబాటులో ఉన్నాయి. వర్సిటీలో మొత్తం 1500 సీట్లు ఉన్నాయి.

పీజేటీఎస్​ఏయూ అగ్రికల్చరల్​ డిప్లొమా
గతేడాది నుంచి ప్రొ. జయశంకర్​ అగ్రికల్చర్​ వర్సిటీలో డిప్లొమా అడ్మిషన్లకు పాలీసెట్​ ర్యాంకును ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. అగ్రికల్చరల్ డిప్లొమాలో 620 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆర్గానిక్​ అగ్రికల్చర్ డిప్లొమా(రెండేళ్లు)లో 60 సీట్లు, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్​ డిప్లొమా(మూడేళ్లు)లో 110 సీట్లు ఉన్నాయి. 

పీజేటీఎస్​ఏయూ వెటర్నరీ డిప్లొమా 
పాలీసెట్​ ద్వారా పీవీ నర్సింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో ఎనిమల్​ హస్బెండరీ పాలిటెక్నిక్ (రెండేళ్లు), ఫిషరీస్​ పాలిటెక్నిక్​(రెండేళ్లు) ప్రవేశాలు పొందవచ్చు. ఎనిమల్​ హస్బెండరీ పాలిటెక్నిక్​లలో మొత్తం 120 సీట్లు అందుబాటులోఉండగా, ఫిషరీస్​ పాలిటెక్నిక్​ మాత్రం ఏపీలోని శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ కొలాబరేషన్​తో పూర్తి చేయాల్సి ఉంటుంది. మొత్తం సీట్లలో తెలంగాణ స్టూడెంట్స్​కు 11 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

నోటిఫికేషన్
టెస్ట్​: పాలిటెక్నిక్‌‌ కామ‌‌న్ ఎంట్రన్స్ టెస్ట్‌‌ 2021
అర్హత‌‌: ప‌‌దో త‌‌ర‌‌గ‌‌తి ఉత్తీర్ణత‌‌. 
ఫీజు: రూ.400, ఎస్సీ/ఎస్టీల‌‌కు రూ.250
చివ‌‌రితేది: జూన్​ 25(రూ.100 లేట్​ ఫీజుతో జూన్​ 27, రూ.300 లేట్​ ఫీజుతో జూన్​ 30)
వెబ్​సైట్​: www.sbtet.telangana.gov.in

- వెలుగు ఎడ్యుకేషన్​ డెస్క్​