ఇయ్యాల 11 గంటలకు పాలిసెట్ రిజల్ట్

ఇయ్యాల 11 గంటలకు పాలిసెట్ రిజల్ట్

హైదరాబాద్, వెలుగు : పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్ –2023 ఫలితాలు శుక్రవారం రిలీజ్ కానున్నాయి. ఉదయం 11గంటలకు మాసబ్ ట్యాంకులోని ఎస్​బీటెట్ ఆఫీసులో టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఫలితాలను రిలీజ్ చేస్తారని ఎస్​బీటెట్ డైరెక్టర్ శ్రీనాథ్ చెప్పారు. ఈ నెల 17న పాలిసెట్ పరీక్ష జరగ్గా.. 98,273 మంది హాజరయ్యారు. పరీక్ష పెట్టిన పదిరోజుల్లోనే ఫలితాలు రిలీజ్ చేయనుండటం విశేషం..