బీఆర్​ఎస్​ పాలనతో ప్రజలు విసిగిపోయిన్రు : పొంగులేటి ప్రసాద్ రెడ్డి

బీఆర్​ఎస్​ పాలనతో ప్రజలు విసిగిపోయిన్రు : పొంగులేటి ప్రసాద్ రెడ్డి

ఖమ్మం రూరల్, వెలుగు : బీఆర్​ఎస్ ప్రభుత్వ నిరంకుశ పాలనతో ప్రజలు విసిగిపోయారని కాంగ్రెస్​ జిల్లా నాయకుడు పొంగులేటి ప్రసాద్​రెడ్డి చెప్పారు. మంగళవారం మండలంలో సాయిగణేశ్​ నగర్ లోని పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆటో యూనియన్ నాయకుడు రామన్నపేట చల్లా క్రిష్ణ ఆధ్వర్యంలో 100  కుటుంబాలు, గుదిమల్ల ఆటో యూనియన్ నాయకులు పారా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 60 కుటుంబాలు, బత్తుల మధు ఆధ్వర్యంలో పోలేపల్లి నుంచి 50 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరాయి.

వారందరికీ పొంగులేటి ప్రసాద్​రెడ్డితో పాటూ ఏఐసీసీ అబ్జర్వర్ వినాయక్ దేష్ ముఖ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఓటేసి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేక, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక బీఆర్​ఎస్​లో ప్రజా ప్రతినిధులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన వెంటనే పేద ఆటో డ్రైవర్లకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చే  బాధ్యత శీనన్న తీసుకుంటారని హామీ ఇచ్చారు.

ALSO READ : తెలంగాణ లొ వచ్చేది కాంగ్రెస్​ ప్రభుత్వమే : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

వినాయక్ దేశ్ ముఖ్ మాట్లాడుతూ తాను రాహుల్ తో కలిసి భారత్​ జోడో యాత్రలో దేశం మొత్తం తిరిగానని, అయినప్పటికీ తాను శీనన్నకు అభిమానినని చెప్పారు. తొలుత దాన్వాయిగూడెం-, రామన్నపేట గ్రామల నుంచి సుమారు 150  మంది డ్రైవర్లు తమ ఆటోలతో భారీ ర్యాలీగా పొంగులేటి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీలో చేరిన వారిలో ఉపేందర్, ప్రశాంత్, సోందు మియా, కరుణాకర్, అలీ, ఖాజల్ మియా, వెంకటస్వామి, నాగేశ్వరరావు, శివరాత్రి వీరస్వామి, దండగల ఉపేందర్, యల్లారావు, వెంకటేశ్వర్లు, సాల్వె చంద్రం, చల్ల యల్లయ్య, చెరుకుపల్లి వెంకటేశ్, బండారి శ్రీను, తదితరులు ఉన్నారు.