తుమ్మల తప్పుకోకపోతే ఖమ్మం నుంచి పొంగులేటి

తుమ్మల తప్పుకోకపోతే ఖమ్మం నుంచి పొంగులేటి

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి ఇటీవల ఉమ్మడి జిల్లాలోని మూడు జనరల్ సీట్లలో ఎక్కడైనా సిద్ధమంటూ అప్లై చేశారు. ఆ తర్వాత మారిన పరిణామాలు, కమ్యూనిస్టులతో చర్చలు, తుమ్మల చేరిక వంటి అంశాలు తెరపైకి వచ్చాయి. ఈ సమయంలో పార్టీ ఆలోచన మేరకు పాలేరులో కందాల ఉపేందర్ రెడ్డిపై పోటీకి సిద్ధమయ్యారు. 

నాలుగు మండలాల్లో క్యాంప్ ఆఫీస్ ల ఏర్పాటుకు ఆయన సన్నిహితులు స్థలాల పరిశీలన చేశారు. పాలేరు పరిధిలోని ముఖ్యనేతలతోనూ మాట్లాడి తన మనసులోని మాటను బయటపెట్టారు. ఈ సమయంలో తుమ్మల ఎంట్రీతో సీన్ మారింది. చివరకు పాలేరు సీటు రేసు నుంచి తుమ్మల తప్పుకోకపోతే పొంగులేటి ఖమ్మం నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. 

సీపీఐతో కాంగ్రెస్ చర్చలు ఒకవైపు, జలగం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరొచ్చన్న ప్రచారం మరోవైపు ఉండడంతో కొత్తగూడెం ఆప్షన్ పొంగులేటికి లేదని అనిపిస్తోంది. జలగం రాకున్నా, పొత్తుల్లో సీపీఐకి ఆ సీటును కాంగ్రెస్ కేటాయించే చాన్సుంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పాలేరు లేకపోతే, ఖమ్మం నుంచి పొంగులేటి పోటీ చేసే అవకాశముంది.