ధనిక రాష్ట్రం కాస్త అప్పుల రాష్ట్రంగా మారింది : పొంగులేటి

ధనిక రాష్ట్రం కాస్త అప్పుల రాష్ట్రంగా మారింది : పొంగులేటి

ప్రజలను హిప్నటిజం చేయడంలో సీఎం కేసీఆర్ దిట్టా అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పాలేరులో  జరిగిన అత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.   రాష్ట్రం ఏర్పడితే బతుకులు బాగుపడతాయనుకుంటే పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిందన్నారు. రాష్ట్రం కోసం బలిదానులు చేసుకున్న యువకుల త్యాగాలకు విలువ లేకుండా పోయిందన్నారు.  ధనిక రాష్ట్రం కాస్త అప్పుల రాష్ట్రంగా మారిందని విమర్శించారు. ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క వాగ్థానాన్ని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. గిరిజన బంధు , దళిత బంధు , డబుల్ బెడ్ రూం ఇండ్లలో లోపాలున్నాయన్నారు. బడ్జెట్లో ప్రకటించినట్లుగా నిధుల కేటాయింపులు జరగడం లేదని పొంగులేటి చెప్పారు. ప్రజలకు మాయ మాటలు చెప్పి మళ్లీ అధికారంలోకి రావాలని ప్రభుత్వం భావిస్తుందని ఆయన ఆరోపించారు. బిల్లులు వచ్చేవి రావని తెలిసి కొంత మంది బీఆర్ఎస్ ను  వీడి రాలేకపోతున్నారని  పొంగులేటి ఆరోపించారు.