ఏ గూటి పక్షి అక్కడకే వస్తది.. ఇంకా వస్తరు: పొంగులేటి

ఏ గూటి పక్షి అక్కడకే వస్తది.. ఇంకా వస్తరు: పొంగులేటి

తెలంగాణ ప్రభుత్వంపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.ప్రైవేటు యూనివర్సిటీలను మీ నాయకులకే ఇవ్వటం కాదు.. విద్యను సరళీకృతం చేయాలంటూ కేసీఆర్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు.. 24 గంటలు కరెంట్ ఇస్తే  గ్రామాల్లో రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా  వైరా ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి పాల్గొన్నారు. వేలాది మంది తనను ప్రోత్సహిస్తున్నారని..ఏ పార్టీ అని కాకుండా శీనన్న ఉన్నడా లేదా అని మాత్రమే చూస్తున్నారని అన్నారు.  ఏ గూటి పక్షి అక్కడికే వస్తుందని..ఇంకా ఎంతో మంది తన వెంట రావాల్సి ఉన్నా సర్పంచ్ నిధుల కోసం వెనకడుగేశారన్నారు..  

 తెలంగాణ ప్రజలు కన్న కలలు కలలుగానే మిగిలిపోతున్నాయని పొంగులేటి అన్నారు.  కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పటి వరకు సాధించిందేమిటని ప్రశ్నించారు. రైతుల రుణమాఫీకి అడ్డొచ్చిన కరోనా ,  కొత్త సెక్రటేరియట్ కట్టడానికి అడ్డురాలేదా అని అన్నారు. 3లక్ష్ల కోట్ల బడ్జెట్ అంటూ అంకెల్లో కాకుండా ప్రజలకు ఉపయోగపడే అవసరాలకు ఖర్చు చేయాలన్నారు. ఏ ఒక్క కార్పొరేషన్ కు కేటాయించిన నిధుల్లో 10 శాతం కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు.