రాష్ట్రానికి సర్వరోగ నివారిని కాళేశ్వరమేనని సీఎం కేసీఆర్ అంటున్నారని…. మరి కాళేశ్వరానికి జాతీయ హోదా వద్దని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేస్తే కేసీఆర్ ఎందుకు స్పంధించడం లేదని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. కాళేశ్వరం అక్రమ ప్రాజెక్టని కేసీఆర్ కు తెలుసని అందుకే కామ్ గా ఉన్నారని అన్నారు. నిజానికి 35వేల కోట్లు ఖర్చుపెడితే పూర్తయ్యే ప్రాజెక్టు కెసిఆర్ లక్ష కోట్లు ఖర్చుపెట్టాడని ఆయన అన్నారు. ఇంత ఖర్చుపెట్టినా ఒక్క చుక్క నీరు పారడం లేదని చెప్పారు.
గోదావరి, కృష్ణా నీళ్లు ఆంధ్ర ప్రదేశ్ కు నీళ్లు తీసుకెళతామని కేసీఆర్ అంటున్నరని ఇది ఆశ చూపి దోపిడీ చేసే ప్రయత్నమని చెప్పారు పొన్నాల. పాలమూరు రంగారెడ్డికి 20వేల కోట్లు ఖర్చు పెట్టారని ఎకరం నీరుకుడా పారలేదని అన్నారు. గతంలో ఆంధ్ర ప్రదేశ్ కు నీళ్లు ఇవ్వొద్దని కేసీఆర్ పబ్బం గడుపుకొని అధికారంలోకి వచ్చాడని అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం తీనే నీళ్లిస్తానంటున్నాడని చెప్పారు. ప్రజల సమస్యలు గాలికి వదిలేసి కేసీఆర్ నియంతగా మారాడని చరిత్రలో చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని చెప్పారు. ప్రాజెక్టుల పై ఎన్నోసార్లు బహిరంగ చర్చకు సవాల్ చేస్తే పట్టించుకోవడం లేదని చెప్పారు. ప్రజలు కేసీఆర్ నియంత పాలనకు తగిన శాస్త్రి చేస్తారని అన్నారు.
