ఆదాయం పెంచుకోవడమే ముఖ్యమా?

ఆదాయం పెంచుకోవడమే ముఖ్యమా?

హైదరాబాద్: ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి అవుతున్న తరుణంలో ఆంక్షలు పెట్టకుండా, బార్లు తెరిచి ఆదాయం పెంచుకోవడంపై దృష్టి పెట్టడం ఏంటని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అందరూ తాగండి.. ఊగండి అనేలా కేసీఆర్ సర్కారు తీరు ఉందన్నారు. ప్రభుత్వం ప్రజల్ని మందుకు బానిసలుగా మార్చుతోందన్నారు. అభివృద్ధిలో కాకుండా.. అప్పుల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారని విమర్శించారు. త్వరలోనే కేసీఆర్ కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

గాంధీని దూషించిన ఆధ్యాత్మిక గురువు అరెస్టు

జనవరి 1 తర్వాత శుభవార్త ఉంటుంది

క్రికెట్కు రాస్ టేలర్ గుడ్ బై