గాంధీని దూషించిన ఆధ్యాత్మిక గురువు అరెస్టు

గాంధీని దూషించిన ఆధ్యాత్మిక గురువు అరెస్టు

రాయ్పూర్: జాతిపిత మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు కాళీచరణ్ మహరాజ్ ను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో మధ్య ప్రదేశ్ కు చేరుకున్న రాయ్ పూర్ పోలీసులు.. ఖజురహో నగరానికి 25 కిలో మీటర్ల దూరంలో అద్దె ఇంట్లో ఉన్న కాళీచరణ్ ను పట్టుకున్నారు. రోడ్డు మార్గంలో కాళీచరణ్ ను పోలీసులు ఛత్తీస్ గఢ్ కు తీసుకొస్తున్నారు. రాయ్ పూర్ లో నిర్వహించిన రెండ్రోజుల ధరణ్ సన్సద్ కార్యక్రమం ముగింపు వేడుకల్లో మహాత్మా గాంధీని కించపరుస్తూ కాళీచరణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మతాన్ని కాపాడుకునేందుకు హిందూ నేతను ప్రభుత్వాధినేతగా ఎన్నుకోవాలని కాళీచరణ్ ప్రజలను కోరారు. దీనిపై రాయ్ పూర్ పోలీసులు 505/2, 294 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

కాగా, రాయ్ పూర్ లోని రావణ్ భాగా మైదానంలో గత ఆదివారం జరిగిన ధర్మ సన్సద్ లో కాళీచరణ్ ప్రసంగిస్తూ.. మహాత్మా గాంధీపై అభ్యంతరక వ్యాఖ్యలు చేశారు. గాంధీపై దూషణలకు దిగిన కాళీచరణ్.. గాడ్సేను ప్రశంసించడం వివాదానికి దారితీసింది. అంతేగాక, మతాన్ని కాపాడుకునేందుకు ప్రజలు ప్రభుత్వాధినేతగా హిందూ నాయకుడినే ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. 

మరిన్ని వార్తల కోసం: 

వీధి కుక్క కనిపించట్లేదంటూ మహిళ ఫిర్యాదు

క్రికెట్కు రాస్ టేలర్ గుడ్ బై

అద్దె బైకులతో పార్ట్ టైం సంపాదన