కేసీఆర్ ఇప్ప‌టికైనా జ్ఞానోదయం చేసుకోండి

కేసీఆర్ ఇప్ప‌టికైనా జ్ఞానోదయం చేసుకోండి

కరీంనగర్: ఆనాడు పోతిరెడ్డిపాడు నీళ్ళు తరలిస్తే నలుగురు మంత్రులతో రాజీనామా చేసిన కేసీఆర్.. ఇప్పుడు అవే నీళ్లు ఆంధ్రాకు తరలించే ప్రయత్నిస్తున్నార‌ని మండి ప‌డ్డారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. బుధ‌వారం ఆయ‌న క‌రీంన‌గ‌ర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ వెంట‌నే రాజీనామా చేయాలన్నారు. ఇప్పుడు తెలంగాణలో అధికారంలో మీరే ఉన్నా అక్కడ ప్రాజెక్టులకు టెండర్లు జరుగుతున్నాయని.. అపెక్స్ కౌన్సిల్ మీటింగు వెళ్ళడానికి సమయం దొరుకుత లేదా అని ప్ర‌శ్నించారు. పొద్దున లేస్తే ఏదో జరిగిపోయినట్టు మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయని..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను ఆహ్వానించి భోజనాలు పెడతారు, ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లి రాయలసీమను రతనాల సీమ చేస్తామంటారు కానీ..ఈరోజు పోతిరెడ్డిపాడుపై ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే మీరు మౌనంగా ఎందుకు ఉంటున్నారని ప్ర‌శ్నించారు.

ఇప్పటికైనా జ్ఞానోదయం చేసుకొని ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్లి, ఒత్తిడి తెచ్చి పోరాటం చేయాల‌న్నారు. పోతిరెడ్డిపాడు నీళ్ల విషయంలో దక్షిణ తెలంగాణకు అన్యాయం జరిగితే అధికారంలో ఉన్న మీరే దానికి బాధ్యత వహించాలన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మద్దతు అందజేస్తుందని తెలిపారు పొన్నం.