రెండు పిల్లర్లే కుంగాయా.. పదేళ్లు అధికారంలో ఉంది మీరే కదా.?:పొన్నం ప్రభాకర్

రెండు పిల్లర్లే కుంగాయా.. పదేళ్లు అధికారంలో ఉంది మీరే కదా.?:పొన్నం ప్రభాకర్

కాంగ్రెస్ వస్తే కరువు వస్తుందనడం దారుణమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.  మేడిగడ్డలో రెండు పిల్లర్లే కుంగాయన్న కేసీఆర్.. మొన్నటి వరకు అధికారంలో ఉంది మీరే కదా అని ప్రశ్నించారు. బుద్ధి జ్ఞానం ఉన్నోడెవడూ  అలాంటి వ్యాఖ్యలు చేయబోరన్నారు. 

కరీంనగర్ రూరల్ మండలం  మొగ్ధుంపూర్ లో  మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల వ్యవసాయ బాలికల డిగ్రీ కళాశాల నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు పొన్నం. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. స్వామినాథన్ ను స్ఫూర్తిగా తీసుకొని వ్యవసాయ రంగంలో మరింత ముందుకు పోవాలి.

రైతే దేశానికి వెన్నెముక అని అన్నారు పొన్నం.  క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు.  ఈ కాలేజీని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మంజూరు చేయించారు.  వారు ఈ కార్యక్రమానికి వస్తే బాగుండేదన్నారు.  రాజకీయాలకు అతీతంగా తాము పనిచేస్తున్నామని చెప్పారు. రైతు బిడ్డగా ఇక్కడికి కాలేజీ రావడం సంతోషంగా ఉందన్నారు.  మార్క్ ఫెడ్ చైర్మన్ గా చేశా.. వ్యవసాయం మీద అవగాహన ఉందన్నారు. అగ్రికల్చర్ విద్యార్థులకు  ఫీల్డ్ ఎక్సిపీరియన్స్ ఉండాలని.. వ్యవసాయం మీద అవగాహన ఉండాలన్నారు.