
నార్త్, సౌత్ అనే తేడా లేకుండా వరుస ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉంది పూజా హెగ్డే. సౌత్ క్రేజీ హీరోయిన్స్ లిస్టులో అయితే టాప్ పొజిషన్‌లో ఉంది. స్టార్ హీరోస్ అందరితోనూ నటిస్తూ ద బెస్ట్ అనిపించుకుంటోంది. ఇప్పటికే మహేష్, ఎన్టీఆర్, బన్నీలతో నటించి తిరుగులేని విజయాలు తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ‘ఆచార్య’లో రామ్ చరణ్‌తోను, ‘రాధేశ్యామ్’లో ప్రభాస్‌తోను, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో అఖిల్‌తోను నటిస్తోంది. అటు తమిళంలో విజయ్ సరసన ‘బీస్ట్’ మూవీలోనూ యాక్ట్ చేస్తోంది. ఇవి కాకుండా హిందీలోనూ రెండు మూడు చేస్తోంది. ఇప్పుడామె ఖాతాలో మరిన్ని చిత్రాలు చేరనున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్‌తో కొరటాల శివ తీయబోయే మూవీలో హీరోయిన్‌గా పూజను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ‘అరవింద సమేత’లో స్ర్కీన్ షేర్ చేసుకున్న ఎన్టీఆర్, పూజలకు హిట్ పెయిర్‌గా పేరొచ్చింది. దీంతో కొరటాల పూజనే సెలెక్ట్ చేశాడట. అలాగే నితిన్, వక్కంతం వంశీ కాంబోలో రానున్న సినిమాకి కూడా పూజనే తీసుకున్నారట. ఈ సినిమా గురించి త్వరలోనే ప్రకటన రావొచ్చంటున్నారు. ఇక త్వరలో ధనుష్‌తో కూడా జోడీ కట్టనుందట పూజ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ నటించనున్న తెలుగు సినిమా కోసం పూజని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాలో సాయి పల్లవిని తీసుకోనున్నారని చాలా రోజులుగా వినిపిస్తోంది. కానీ ఇప్పుడు పూజ పేరు తెరపైకొచ్చింది. మరి తన ప్లేస్‌లోకి ఈమె వచ్చిందా లేక ఇద్దరూ ఉంటారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి పూజ బ్యాగ్‌లోకి వచ్చి పడుతున్న అవకాశాల్ని చూస్తుంటే ఆమెని ఇప్పట్లో ఎవరూ ఆపలేరనే విషయం అర్థమవుతోంది.