
తెలుగు, తమిళ భాషలతో పాటు బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తోంది పూజా హెగ్డే. ప్రస్తుతం మహేష్‌కి జంటగా ‘గుంటూరు కారం’ చిత్రంలో నటిస్తోంది. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితో నటించిన పూజ.. ఇప్పుడు విజయ్ దేవరకొండకు జంటగా కనిపించనుందని తెలుస్తోంది. విజయ్, పరశురామ్ కాంబోలో ఓ చిత్రం రూపొందనుంది. ‘గీత గోవిందం’ తర్వాత వీరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న రెండో చిత్రమిది. ఇందులో హీరోయిన్‌గా పూజా హెగ్డేను ఫైనల్ చేశారట. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే చాన్స్ ఉంది. విజయ్ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ సినిమాలో నటిస్తున్నాడు. ఇది పూర్తవగానే పరశురామ్ మూవీ సెట్స్ కి వెళ్లనుంది.