
తెలుగు, తమిళం, హిందీ.. మూడు భాషల్లోనూ పూజా హెగ్డే బిజీనే. చేతి నిండా సినిమాలు.. తీరిక లేని షూటింగులు.. ఒకదాని తర్వాత ఒకటిగా అప్‌డేట్లతో పరుగులు తీస్తోంది ఆమె కెరీర్. ఈ సంవత్సరం ఆమె ఐదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వాటిలో రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ని నిన్న రివీల్ చేశారు. విజయ్‌తో కలిసి తమిళ చిత్రం ‘బీస్ట్’లో నటిస్తోంది పూజ. నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. రిలీజ్‌కి రెడీ అవుతున్న ఈ మూవీలోని మొదటి పాటను వేలంటైన్స్ డే సందర్భంగా విడుదల చేస్తున్నట్లు నిన్న ప్రకటించారు. అనిరుధ్ కంపోజ్ చేసిన ఈ పాటకి శివకార్తికేయన్ లిరిక్స్ రాయడం విశేషం. ఇక బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్‌తో ‘కభీ ఈద్ కభీ దివాలీ’ అనే సినిమా చేస్తోంది పూజ. ఫర్హాద్ సామ్‌జీ దర్శకత్వంలో సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తున్న ఈ మూవీని వచ్చే యేడు రంజాన్‌కి రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్‌మెంట్ వచ్చింది. రెలీజియన్ రిలేటెడ్‌గా ఉందంటూ ఈ సినిమా టైటిల్ విషయంలో కొందరు అభ్యంతరం చెప్పారు. దాంతో ఎవరి మనోభావాల్నీ దెబ్బ తీయకుండా టైటిల్ మార్చే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ‘భాయీజాన్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసే చాన్స్ ఉంది. మొత్తానికి ఒకేరోజు పూజ నటిస్తున్న రెండు సినిమాల అప్‌డేట్స్‌తో ఆమె ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్ ఇచ్చినట్టయ్యింది.